ఆదిపురుష్ వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి

ఆదిపురుష్ వివాదంపై స్పందించిన కేంద్రమంత్రి

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ఆదిపురుష్ మూవీ కొన్ని చోట్ల మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.పలు విషయాల్లో మాత్రం పెద్ద ఎత్తున్న విమర్శలు ఎదుర్కొంటోంది.ప్రధానంగా డైలాగ్స్ చుట్టూ ఉన్న వివాదంపై తొలిసారి కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) స్పందించారు.ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రజల నమ్మకాలని, హిందూ మత విశ్వసాలని అగౌరపరిచే చర్యలని సమర్ధించేది లేదని తెలిపారు.స్వయంగా తానే ఈ అంశంపై పర్యవేక్షిస్తానని వెల్లడించారు.

ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతషీర్ శుక్ల (Manoj Muntashir Shukla) తాను రాసిన ఇబ్బందికరమైన మాటలని మారుస్తానని వెల్లడించిన విషయం తెలిసేందే.. అందుకు తగినట్లుగానే ఆదిపురుష్ టీమ్ హనుమంతుడి పై రాసిన వివాదస్పదమైన డైలాగ్స్ ని మార్చే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.రామాయణం తీసే పద్ధతి ఇది కాదంటూ డైరెక్టర్ కి ఇష్టం వచ్చినట్లు తీస్తే రామాయణం అనరని పలువురు భిన్నభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు. 

ఆదిపురుష్ సినిమాను రూ.500 కోట్ల బడ్జెట్ తో టి సిరీస్ రెట్రో ఫైల్స్ నిర్మించాయి.