విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోం

విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోం

కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఆరోపించారు. కేసీఆర్ చెప్పినట్లు విద్యుత్ బిల్లులో సబ్సిడీలు ఎత్తివేస్తున్నట్లు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీలను ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే విద్యుత్ బిల్లును తీసుకొచ్చామన్న మంత్రి... తక్కువ ధరకు విద్యుత్ సేవలు అందించడమే బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

విద్యుత్ బిల్లు వల్ల కంపెనీల మధ్య పోటీ తత్వం పెరిగి... తక్కువ ధరకే నాణ్యమైన కరెంట్ లభిస్తుందని వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ సంస్కరణ బిల్లును వెనక్కి తీసుకునేది లేదని మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. కేసీఆర్ మోనోపోలీ కోరుకుంటున్నారని, అబద్ధాలు మానుకొని రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని విమర్శించారు.