గెస్ట్‌‌హౌజ్‌‌కు తాళాలు.. బయటే నిల్చొన్న కేంద్ర మంత్రి

గెస్ట్‌‌హౌజ్‌‌కు తాళాలు.. బయటే నిల్చొన్న కేంద్ర మంత్రి

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మెదక్ జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ కు అవమానం జరిగింది. బాల్యన్ కోసం మెదక్ లో  ఆర్అండ్ బీ గెస్ట్ హౌజ్  బుక్ చేశారు నేతలు. అయితే కేంద్రమంత్రి అక్కడకు వచ్చినా అధికారులు తాళాలు తీయకపోవడంతో గంటసేపు బయటే నిల్చొన్నారు. తాళాలు వేసిన విషయాన్ని రెవెన్యూ, పోలీసులకు తెలియచేసినట్లు బీజేపీ నేత తెలిపారు. అనంతరం గెస్ట్ హౌజ్ తాళాలు పగలకొట్టి లోపలికి వెళ్లడం జరిగిందన్నారు. కేంద్రమంత్రి వచ్చినప్పటికీ ప్రోటోకాల్ పాటించని ఆర్అండ్ బీ అధికారులపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. గెస్ట్ హౌజ్ లో  కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవన్నారు. 

మరోవైపు... భాగ్యనగరం కాషాయమయమైంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అంతా రెడీ అయ్యింది. ఇవాళ, రేపు కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. మీటింగ్ కు వచ్చే ప్రముఖుల కోసం HICC నోవాటెల్ దగ్గర భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. పీఎం మోడీ వస్తుండటంతో సెక్యూరిటీ టైట్ చేశారు పోలీసులు. కార్యవర్గ సమావేశాల్లో 18 రాష్ట్రాలకు చెందిన సీఎంలు పాల్గొననున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి నోవాటెల్ కు వెళ్లారు. సాయంత్రం 4 గంటల వరకు రెస్ట్ తీసుకుంటారు. తర్వాత రాత్రి 9 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు.