తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

మెదక్​టౌన్, వెలుగు : బీజేపీతోనే మెదక్​లో రైల్వే లైన్​సాధ్యమైందని  కేంద్ర మత్స్య, పాడిపరిశ్రమ, పశుసంవర్ధక శాఖ మంత్రి సంజీవ్​కుమార్​ బాల్యన్ ​అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని రైల్వేస్టేషన్, స్టేడియంను ఆయన సందర్శించారు. అనంతరం ఆర్​ అండ్​ బీ గెస్ట్​ హౌస్​లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ వల్లనే మెదక్​కు రైల్వే మార్గం వచ్చిందని, ఈ విషయంలో అప్పటి మెదక్ ​ఎంపీ, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకురాలు విజయశాంతి కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. స్టేడియానికి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం అవినీతి ఎక్కువగా ఉందని విమర్శించారు. ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే సులభమవుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి, జనార్దన్​రెడ్డి, రాజశేఖర్, శివకుమార్, జిల్లా జనరల్​ సెక్రటరీలు నల్లాల విజయ్​కుమార్, సుధాకర్​రెడ్డి, మెదక్ టౌన్​ ప్రెసిడెంట్​నాయిని ప్రసాద్ పాల్గొన్నారు.

రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

పటాన్ చెరు, వెలుగు : దేశరక్షణ రంగాన్ని మరింత భలోపేతం చేయడానికి పూర్తి నిబద్ధతతో ఉన్నామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం బీడీఎల్ ఫ్యాక్టరీలో కొత్తగా ఏర్పాటు చేసిన వారహెడ్, ఫ్యాక్టరీ ఆవరణలో గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తర్వాత బీడీఎల్ ఫ్యాక్టరీని సందర్శించి ఎంప్లాయీస్​తో ముచ్చటించారు. రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు కేంద్రం అనేక దేశాల రక్షణ వ్యవస్థలను అధ్యయనం చేసి పరిశోధన ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలిపారు. అంతకు ముందు ఆయనకు బీడీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. 

చాకరి మెట్లలో కేంద్ర మంత్రి శుక్లా పూజలు

మెదక్ (శివ్వంపేట), వెలుగు:  శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ పరిధిలో ఉన్న చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ, రాజ్యసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ శివ్​ప్రతాప్ శుక్లా పూజలు చేశారు. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అంతంకావాలని, బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన వారాహి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నల్ల రవిగౌడ్, మండల ఉపాధ్యక్షుడు వినోద్,  నర్సాపూర్ టౌన్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, నాయకులు రఘువీరారెడ్డి, మల్లేశ్​గౌడ్, సురేశ్ పాల్గొన్నారు.

కేంద్ర మంత్రిని సన్మానించిన బీజేపీ లీడర్లు 

కంది, వెలుగు  : కేంద్ర ఉన్నత విద్యా శాఖ  మంత్రి ధర్మేంద్ర ప్రధాన శనివారం  సంగారెడ్డి లోని కంది ఐఐటీ హైదరాబాద్ లో ఇన్నోవేషన్ పార్కును ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ సంగారెడ్డి జిల్లా లీడర్లు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్, విష్ణువర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్, నర్సింహారెడ్డి, అరవింద్, ప్రవీణ్, నర్సింహ్మ గౌడ్, సాయి, మురారి, రాజేందర్ రెడ్డి, చంద్రకాంత్ పాల్గొన్నారు.