రాష్ట్రంలో వరద నష్టంపై అమిత్ షాకు రిపోర్ట్

రాష్ట్రంలో వరద నష్టంపై అమిత్ షాకు రిపోర్ట్
  • అందజేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్  

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతోపాటు ఏపీలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అందజేసినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఎక్స్​లో ఈ విషయాన్ని వెల్లడించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో శివరాజ్ సింగ్ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా రూపొందించిన రిపోర్టును అమిత్ షాను కలిసి అందజేశారు. త్వరలోనే సెంట్రల్ టీమ్​ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుందని పేర్కొన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రుల బృందం గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వరద నష్టాన్ని వివరించనుంది.