న్యూఢిల్లీ: పార్లమెంటరీ అఫైర్స్, భారీ పరిశ్రమల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని, రెండు సార్లు టెస్టులు చేయగా.. పాజిటివ్ అని తేలిందని ఆయన చెప్పారు. తనతో టచ్‌లో ఉన్నవాళ్లు సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని అన్నారు. కాగా.. పాపడ్‌లు తింటే కరోనా యాంటీ బాడీస్ డెవలప్ అయి.. కరోనా సోకదని గతంలో మేఘ్వాల్ కామెంట్ చేశారు. దీంతో అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది.
