- రాష్ట్రాలకు కేంద్ర జల శక్తి శాఖ లేఖ
హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన–యాక్సెలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (పీఎంకేఎస్‌వై-ఏఐబీపీ)లో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల పనులను జులై 15లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. ఈ మేరకు జలశక్తి శాఖ సీనియర్ కమిషనర్ అమిత్ కుమార్ ఝా అన్ని రాష్ట్రాల ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌లకు లేఖలు రాశారు. ఏఐబీపీలో భాగంగా 99 ప్రాజెక్టులు చేపట్టగా 53 ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని, మిగతావి అనుకున్న టైమ్ లోగా పూర్తి చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులతో ఎన్ని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు, మహిళలు, ఇతర రైతులు లబ్ధి పొందుతున్నారనే వివరాలు గ్రామాల వారీగా అందజేయాలన్నారు. తెలంగాణాలోని గొల్లవాగు, ర్యాలి వాగు, మత్తడివాగు, పాలెంవాగు, నీల్వాయి, ఎస్సారెస్పీ స్టేజీ–2, కుమ్రంభీం ప్రాజెక్టు, భీ మా లిఫ్ట్ స్కీమ్, జగన్నాథపూర్, ఇందిరమ్మ వరద కాలువ, దేవాదుల లిఫ్ట్ స్కీమ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
