
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సైంటిఫిక్, టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ఆఖరిలోగా అప్లయ్ చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 24
పోస్టులు: బోటనిస్ట్ 01, అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ 22, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 1.
ఎలిజిబిలిటీ
బోటనిస్టు: బోటని/ హార్టికల్చర్/ లైఫ్ సెన్సెస్/ అగ్రికల్చర్లో ఎంఎస్సీతోపాటు సంబంధిత విభాగాల్లో కనీసం మూడేండ్ల పరిశోధన అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్: ఇంజినీరింగ్/ ఫార్మసీ/ లైఫ్ సైన్సెస్/ మెడిసిన్ రంగాల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీతోపాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ/ ఫార్మసీ/ మెడిసిన్/ మైక్రోబయాలజీ/ బయోటెక్నాలజీలో ఎంఎస్సీతోపాటు పని అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: బోటనిస్టు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏండ్లు, అసిస్టెంట్ డ్రగ్స్ కంట్రోలర్ పోస్టులకు 40 ఏండ్లు ఉండాలి.
లాస్ట్ డేట్: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.