హైదరాబాద్, వెలుగు: విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధంగా విద్యుత్ చట్టాన్ని రూపొందించారని విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆరోపించింది. విద్యుత్ చట్ట సవరణపై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి వీకే సింగ్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అంజయ్య శుక్రవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు, రైతులకు విద్యుత్ ఉద్యోగులకు ఈ బిల్లుతో అన్యాయం జరుగుతుందన్నారు. ఈఆర్‌సీ నామమాత్రంగా మిగిలిపోతుందని చెప్పారు. రాష్ట్రాలు, ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా బిల్లును తేవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ చట్టాన్ని నిరసిస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో మరో పోరాటానికి సిద్ధమవుతామని తెలిపారు.
