ఖైదీల కోసం యూనిక్ ఎగ్జామినేషన్ సెంటర్

ఖైదీల కోసం యూనిక్ ఎగ్జామినేషన్ సెంటర్

యూపీలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వివిధ జైళ్లలో శిక్ష అనుభిస్తున్న ఖైదీల్లో కొందరు సైతం ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈ క్రమంలో వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తర్ ప్రదేశ్ మాధ్యమిక్ శిక్షా పరిషత్ రాష్ట్రంలోని అన్ని జైళ్లలో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. అయితే లక్నో మోడల్ జైలులో మాత్రం పరీక్ష రాస్తున్న 24మంది ఖైదీల కోసం అధికారులు యూనిక్ ఎగ్జామినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన పుస్తకాలన్నింటినీ అందుబాటులో ఉంచడంతో పాటు వారంతా శ్రద్ధగా చదువుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇక పరీక్షకు హాజరయ్యే ఖైదీలకు జైలు అధికారులు, సూపరింటెండెంట్లు అన్ని విధాలా సహకరించాలని జైళ్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. జైలులో ఉన్న ఉన్నత విద్యావంతులు పరీక్షకు హాజరయ్యే తోటి ఖైదీలకు సహకరించాలని సూచించింది. గతేడాది యూపీ బోర్డ్ ఎగ్జామ్స్ లో టెన్త్ పరీక్ష రాసిన  ఖైదీల్లో 92.23శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ పరీక్షలు రాసిన వారిలో 70.83శాతం మంది మంచి మార్కులతో పాసయ్యారు.