కుల్దీప్ సింగ్ సెంగార్‌కు తాత్కాలిక బెయిల్

కుల్దీప్ సింగ్ సెంగార్‌కు తాత్కాలిక బెయిల్

ఉన్నావ్లో మైనర్పై అత్యాచారం కేసులో జైలులో ఉన్న బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగార్కు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కూతురి పెళ్లి ఉన్నందున తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలంటూ డిసెంబర్ 19న ఆయన  కోర్టును ఆశ్రయించారు. తాజాగా పిటిషన్పై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ఆయనకు 15 రోజుల తాత్కాలిక బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఆదేశాల మేరకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు కుల్దీప్ సింగ్ సెంగార్ కోర్టు నుంచి బయట ఉండనున్నారు.

2017లో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్, అతని స్నేహితులు మైనర్పై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక తండ్రిని హత్య చేశారు. నేరం రుజువుకావడంతో ట్రయల్ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును కొట్టి వేయాలంటూ సెంగార్ 2019 డిసెంబర్ లో ఆయన కోర్టును ఆశ్రయించారు.