విద్యార్థులకు శాపంగా మారిన మధ్యాహ్న భోజనం

విద్యార్థులకు శాపంగా మారిన మధ్యాహ్న భోజనం
  • అన్నం కూడా ఒకే గంటెడు
  • గద్వాల జిల్లా బింగిదొడ్డి యూపీఎస్​లో ఇదీ దుస్థితి 

అయిజ, వెలుగు: గద్వాల జిల్లా అయిజ మండలంలోని బింగిదొడ్డిలోని యూపీఎస్ స్కూల్ లో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, గొడ్డుకారం పెట్టారు. స్కూల్​లో ఏడో తరగతి వరకు ఉండగా 253 మంది చదువుతున్నారు. మెనూ ప్రకారం శుక్రవారం అన్నం, ఆకు కూరతో పాటు గుడ్డు ఇవ్వాల్సి ఉండగా, గంటెడు అన్నం, గొడ్డుకారం పెట్టారు. దీంతో చాలామంది తినకుండా పడేశారు. దీన్ని గుర్తించిన గ్రామస్థులు నిర్వాహకులను నిలదీశారు. అయినా వారు స్పందించలేదు. హెచ్ ఎం శ్రీధర్ రెడ్డి మాత్రం మెనూ ప్రకారమే కిచిడీ, పల్లి కారం పెట్టామని తెలిపారు. గద్వాల జిల్లా డీఈఓ సిరాజుద్దీన్ ను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.