
నేరడిగొండ, వెలుగు: నేరడిగొండలోని వడూర్ నుంచి బొందిడి రూట్లో ఉన్న ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ గద్దె కూలి, చేతికందే ఎత్తులో ఫెన్సింగ్ లేకుండా ఉండటంతో పశువులు, గ్రామస్తులకు ప్రమాదం పొంచి ఉంది.
ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదకరంగా ఉన్నా విద్యుత్ ఆఫీసర్లు చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ట్రాన్స్ఫార్మర్ కు కొత్త గద్దె నిర్మించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.