
బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఆహా నిర్వహకులు రిలీజ్ చేశారు. ఇందులో పవన్ నటించిన బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ తో ఓ వీడియో వదిలారు. ఈ వీడియోను ఆహా సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఇందులో పవన్, బాలయ్య మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. "అన్‌స్టాపబుల్ 2లో బాలయ్యతో పవన్ హంగామా ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం.. త్వరలో పవర్ స్ట్రోమ్ లోడింగ్" అంటూ మేకర్స్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.
పవన్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టుడియోలో అన్‌స్టాపబుల్ 2 సెట్లో చిత్రీకరించారు. ఈ షో కు పవన్ తో పాటు డైరెక్టర్ క్రిష్, త్రివిక్రమ్ సైతం హాజరయ్యారు. ఇప్పటి వరకు ఎలాంటి షోల్లో కనిపించని పవన్, అన్‌స్టాపబుల్‌కి రావడంతో షోకి మరింత క్రేజ్ పెరిగింది. పవన్ బాలయ్యతో తాను తీయబోయే సినిమాలపై మాట్లాడుతాడా లేక రాజకీయాలపై చర్చిస్తాడా అన్న అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.