మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షంతో ఆగం

మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షంతో ఆగం

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలోని గార్ల, డోర్నకల్, కురవి, మహబూబాబాద్, మరిపెడ మండలాల్లో మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులతో మొక్కజొన్న, మిర్చి రాశులు దెబ్బతిన్నాయి. సీరోల్  మండలం కాంపల్లి గ్రామంలో అకాల వర్షానికి సక్రామ్​నాయక్ తండాకు చెందిన బానోత్​ అంకి, లక్ష్మణ్ కు చెందిన 40 క్వింటాళ్ల మిర్చి తడిసిపోయింది. మిగిలిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈదురుగాలులతో కూలీ మృతి

మెదక్, వెలుగు: మెదక్  గవర్నమెంట్  మెడికల్  కాలేజీ బిల్డింగ్​ పనులు చేస్తున్న కూలీ ప్రమాదవశాత్తు చనిపోయాడు. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన జింక వెంకట్(46) సైట్ లో రేకులతో షెడ్  నిర్మిస్తుండగా, ఈదరుగాలితో పై నుంచి కింద పడిపోయాడు. తీవ్రగాయాలతో చనిపోగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.