జెండా ఆవిష్కరణ గొడవకు దారి తీసింది

జెండా ఆవిష్కరణ గొడవకు దారి తీసింది

ఆత్మకూరు, వెలుగు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ టీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవకు దారి తీసింది. కొబ్బరికాయలు కొట్టే సమయంలో రెండు వర్గాల మధ్య తొక్కిసలాట జరిగింది. ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాలు తొక్కాడు అనే విషయంలో గొడవ మొదలైంది. చొక్కా గల్లా లు పట్టుకొని బూతులు తిట్టుకున్నారు. ఈ గొడవ ఇలా ఉండగా టీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పాపని రవీందర్ జెండా ఎగురవేశారు. ఈ గొడవ విషయంలో రెండు వర్గాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నాయి. సీఐ గణేష్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

వర్ధన్నపేటలోనూ..

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఫీసులో జెండా ఆవిష్కరణకు ముందు పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అరూరి రమేశ్, మున్సిపల్​చైర్​పర్సన్, వైస్​చైర్మన్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్​లో జెండా ఆవిష్కరణకు వైస్​చైర్మన్​, కౌన్సిలర్లు  వస్తున్నట్లు మున్సిపల్​చైర్​పర్సన్​కు, కమిషనర్​కు సమాచారమిచ్చినా పట్టించుకోకుండా జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. దీంతో మున్సిపల్  వైస్​చైర్మన్​, కౌన్సిలర్లు కిందే ఉండిపోయారు. చైర్​పర్సన్​పట్టించుకోక పోవడం, కమిషనర్​ప్రొటోకాల్ పాటించకపోవడంతో  వైస్​చైర్మన్, కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.