'సీతారామం' నుండి భూమిక లుక్‌ రిలీజ్

'సీతారామం' నుండి భూమిక లుక్‌ రిలీజ్

మ‌ల‌యాళ స్టార్ దుల్కర్ స‌ల్మాన్ హీరోగా 'సీతారామం' చిత్రంలో న‌టిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్, ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. దర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడి యుద్ధ నేప‌థ్యంలో సాగే పీరియాడిక్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్పణ‌లో స్వప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై స్వప్న ద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతారామం ఆగ‌స్టు 5న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో థియేట‌ర్లలో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి భూమికా చావ్లా లుక్‌ను విడుద‌ల చేశారు మేకర్స్. భూమిక ఒడిలో క్యూట్ పాప‌తో ఉన్న లుక్ ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది. భూమిక ఈ సినిమాలో బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మ (సుమంత్‌) భార్యగా న‌టిస్తోంది. డైరెక్టర్ త‌రుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో న‌టిస్తుండ‌గా.. ర‌ష్మిక క‌శ్మీరీ యువ‌తి అఫ్రీన్‌గా..అక్కినేని సుమంత్ బ్రిగేడియ‌ర్ విష్ణు శ‌ర్మగా న‌టిస్తున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన లుక్స్ విడుద‌ల చేశారు.ఇందులో ప్రకాశ్‌రాజ్ మ‌రో కీ రోల్‌ పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ మ్యూజిక్ డైరెక్టర్ అందిస్తున్నాడు.