ఆడుకుంటుండగా కుప్పకూలి గుండెపోటుతో విద్యార్థి మృతి

ఆడుకుంటుండగా కుప్పకూలి గుండెపోటుతో విద్యార్థి మృతి

హార్ట్ ఎటాక్ చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. ఒకప్పుడు గుండెపోటు అంటే వృద్దులు, 50 ఏళ్ళు పై బడిన వారికి వచ్చేది.. మరిప్పుడు స్కూల్ కి వెళ్లే చిన్నారులను కూడా వదలడం లేదు. హార్ట్ ఎటాక్ ఎప్పుడు,  ఏ క్షణంలో, ఏ వయసు వారికి వస్తుందో కూడా తెలియడం లేదు. ఈ మధ్య కాలంలో అనేక మంది గుండెపోటుతో మరణించారు. వీరిలో చిన్నపిల్లలు కూడా ఉండడం బాధను కలిగిస్తోంది. అప్పటి వరకు యాక్టివ్‌గా కనిపించిన వారు కూడా.. ఉన్నపళంగా పడిపోతూ.. గుండె ఆగి చనిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. 15 ఏళ్లకే గుండెపోటుతో విద్యార్థి మరణించడం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.  

అసలు ఏం జరిగిందంటే.. 

నోయిడాలోని గౌతంబుద్ నగర్ జిల్లాలోని జల్పురా ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రోహిత్ సింగ్ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా కింద పడిపోయాడు. దీంతో అక్కడున్న తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోహిత్ సింగ్ ను లేపడానికి ప్రయత్నించారు.

అయితే రోహిత్ సింగ్ పడిపోయినప్పటి నుంచి ఎంతసేపటికి స్పృహలోకి రాకపోవడంతో..  అతన్ని ఉపాధ్యాయులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాలుడికి ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే  బాలుడు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే రోహిత్ సింగ్ మరణానికి కారణం గుండెపోటేనని డాక్టర్లు నిర్థారించారు.