ఉత్తరప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తులపై బ్యాన్

ఉత్తరప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తులపై బ్యాన్

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ సర్టిఫికేషన్ తో కూడిన ఆహార పదార్థాలు, మెడిసిన్స్, కాస్మోటిక్స్ తదితర ఐటమ్స్ నిల్వ, ఉత్పత్తి, పంపణీపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.  కొన్ని సంస్థలు నకిలీ డాక్యుమెంట్స్ తో హలాల్ సర్టిఫై ఉత్పత్తులను అమ్ముతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే  ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. 

ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించామని అధికారులు చెప్పారు. ఇస్లామిక్ చట్టానికి అనుగుణంగా ఉత్పత్తులు ఉంటే హలాల్ సర్టిఫికేషన్ ఇస్తారు. అయితే, ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్– 2006 ప్రకారం.. ఆహార ఉత్పత్తుల నాణ్యతను ధ్రువీకరించే హక్కు అధికారులకు మాత్రమే ఉందని యూపీ ఫుడ్ కమిషనర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. హలాల్ సర్టిఫికేషన్ తో కూడిన ఆహార ఉత్పత్తులు పుడ్ సేప్టీ యాక్ట్  కు విరుద్ధమని స్పష్టం చేశారు.