ఎద్దుల పోట్లాటలో పోలీసుల జోక్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఎద్దుల పోట్లాటలో పోలీసుల జోక్యం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఎద్దుల పోట్లాటను అడ్డుకునేందు ఇద్దరు పోలీసులు ప్రయత్నించడంతో అవి వారిపైకే దూసుకువచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో.. రెండు ఎద్దులు కొమ్ములతో పొట్లాడుకోవడంతో ప్రారంభమవుతుంది.

అంతలోనే పక్కనే ఉన్న పోలీసులు బారికేడ్ లతో వాటిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పటివరకూ భీకరంగా పొట్లాడుకుంటున్న ఆ రెండు ఎద్దుల్లో ఒకటి.. పోలీసుల మీదకు దూసుకువచ్చింది. ఈ ప్రాణాంతక దాడి నుంచి తృటిలో తప్పించుకుని పోలీసులు అక్కడ్నుంచి పారిపోయారు.