నీ వల్లేరా.. నా లవర్ దూరం అయ్యింది : చెన్నై డాక్టర్ పై.. యూపీ వ్యక్తి కాల్పులు

నీ వల్లేరా.. నా లవర్ దూరం అయ్యింది : చెన్నై డాక్టర్ పై.. యూపీ వ్యక్తి కాల్పులు

ఇదో సినిమా కథ అనుకునేరు.. రియల్ స్టోరీ.. తమిళనాడు రాష్ట్రం చెన్నై సిటీ నడిబొడ్డున జరిగిన ఘటన.. పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీలో రోహన్ అనే స్టూడెంట్ పీజీ చదువుతూ డాక్టర్ గా పని చేస్తున్నాడు.. 2024, ఏప్రిల్ 14వ తేదీ సాయంత్రం మెడికల్ కాలేజీ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న టీ స్టాల్ దగ్గర కూర్చుని.. టీ తాగుతున్నాడు.. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్, రితిక్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి.. రోహన్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు.. జస్ట్ మిస్.. తూటాల నుంచి తప్పించుకున్నాడు రోహన్.. ఆ వెంటనే టీ స్టాల్ దగ్గర ఉన్న మిగతావారితో కలిసి కాల్పులు జరిపిన వారిని పట్టుకోవటానికి ప్రయత్నించారు.. రితిక్ దొరకగా.. అమిత్ పారిపోయాడు.. 

డాక్టర్ రోహన్ పై కాల్పులకు కారణం లవ్ స్టోరీనే :

రోహన్ చదువుతున్న మెడికల్ కాలేజీలోనే కాల్పులు జరిపిన యూపీకి చెందిన అమిత్ కుమార్ లవర్ చదువుతుంది. కొన్నాళ్లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అమిత్ కుమార్ తో మాట్లాడటం మానేసింది అతని లవర్.. దీనికి కారణం రోహన్ ఆమెతో చనువుగా ఉండటమే అనేది అమిత్ కుమార్ అనుమానం.. దీన్ని మనసులో పెట్టుకున్న అమిత్.. తన ఫ్రెండ్ రితిక్ తో కలిసి ఉత్తరప్రదేశ్ లో ఓ తుపాకీ కొనుగోలు చేసి.. ఆ తుపాకీతో చెన్నై వచ్చాడు.

తన లవర్ ను తనకు కాకుండా చేసిన రోహన్ ను చంపేయాలని నిర్ణయించుకుని.. రెండు రోజులు రెక్కీ నిర్వహించి.. ఆదివారం సాయంత్రం ఈ ఎటాక్ చేశాడు అమిత్ అండ్ రితిక్. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం రితిక్ పోలీస్ కస్టడీలో ఉండగా.. అమిత్ కోసం గాలిస్తున్నారు. మొత్తానికి లవర్ విషయంలో అనుమానాలతోనే రోహన్ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.