Viral news:యూపీలో షోలే సీన్ రిపీట్..మరదలిని మూడో పెళ్లి చేసుకుంటానంటూ..విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

Viral news:యూపీలో షోలే సీన్ రిపీట్..మరదలిని మూడో పెళ్లి చేసుకుంటానంటూ..విద్యుత్ టవర్ ఎక్కిన యువకుడు

యూపీలో హై ఓల్టేజ్ డ్రామా చోటు చేసుకంది. భార్య చెల్లెలిని పెళ్లి చేసుకుంటానంటూ..ఒప్పుకోక పోతే చచ్చిపోతాను అంటూ విద్యుత్ టవర్ ఎక్కాడు బెదిరించాడు ఓ యువకుడు.బాలీవుడ్ సినిమా షోలే లో సీన్ ను తలపించేలా.. భార్యను ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దాదాపు హాఫ్ డే కట్టుకున్న పెళ్లాన్ని, బంధువులను, స్థానికులను అటు పోలీసులు ముప్పుతిప్పలు పెట్టాడు.. చివరికి ఏం జరిగింది.. అతను టవర్ నుంచి దిగాడా.. తన చెల్లెలిని పెళ్లి చేసుకునేందుకు పెళ్లాం ఒప్పుకుందా.. వివరాల్లోకి వెళితే.. 

అది ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ జిల్లాలోని ఓ కుగ్రామం. రాజ్ సక్సేనా అనే వ్యక్తికి 2021లో అదే గ్రామానికి చెందిన మహిళను పెళ్లిచేసుకున్నాడు.. అయితే అనారోగ్య కారణాలతో ఆమె చనిపోయింది.. రాజ్ సక్సేనా ఒంటరి వాడు కాకుండా చనిపోయిన అతని భార్య చెల్లెలిని అతనికిచ్చి పెళ్లి చేయాలని బంధువులు, కుటుంబ సభ్యులు భావించారు.. అలాగే చేశారు. ఏడాది గడిచింది.. అంతాబాగానే ఉంది అనుకునే సమయంలో రాజ్ సక్సేనాకు ఓ వింత కోరిక, ప్రేమ పుట్టాయి. 

రాజ్ సక్సేనాకు ప్రస్తుతం ఉన్న భార్య చెల్లెలిపై కన్నుపడింది..ఎలాగైనా ఆమె పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. గత కొంతకాలంగా ఆమె చుట్టూ తిరుగుతున్నాడు.. ఇటీవల కాలంలో రాజ్ సక్సేనా తన కోరికను భార్యకు చెప్పాడు. తను ఉండగా తన చెల్లెలిని ఎలా చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో మనస్తాపం చెందాడు రాజ్ సక్సేనా. 

►ALSO READ | అడుక్కోవటం నేరం.. బొచ్చ పట్టుకుంటే పట్టుకొచ్చి సెల్టర్ లో వేస్తారు : బెగ్గింగ్ నిషేధ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం..

గురువారం గ్రామానికి సమీపంలో ఉన్న హైఓల్టేజ్ పవర్ సప్లయ్ టవర్ ఎక్కాడు. భార్య చెల్లెలిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటే గానీ టవర్ దిగనని రాజ్ సక్సేనా మొండి పట్టుబట్టాడు.. దీంతో భార్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అంతా ఆందోళన చెందారు. రాజ్ సక్సేనా బుజ్జగించి కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి.  ఈ లోగా సీన్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు.  రాజ్ సక్సేనాకు నచ్చజెప్పి చివరికి కిందకు దించారు.  

అయితే రాజ్ సక్సేనాకు అతని మరదలికి పెళ్లి చేశారా లేదా అనే వివరాలు ఇంకా తెలియరాలేదు గానీ.. మీడియాతో మాట్లాడిన రాజ్ సక్సేనా.. తన మరదలంటే తనకు ఇష్టమని.. ఆమె కూడా తనను ప్రేమిస్తుందని చెప్పడం కొసమెరుపు.

ఈ హై-వోల్టేజ్ డ్రామా వీడియోలు, ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆసక్తికరంగా , వినూత్నంగా. షోలే లోని సీన్ ను తలపించే ఈ సంఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.