అడుక్కోవటం నేరం.. బొచ్చ పట్టుకుంటే పట్టుకొచ్చి సెల్టర్ లో వేస్తారు : బెగ్గింగ్ నిషేధ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం..

అడుక్కోవటం నేరం.. బొచ్చ పట్టుకుంటే పట్టుకొచ్చి సెల్టర్ లో వేస్తారు : బెగ్గింగ్ నిషేధ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం..

మిజోరం రాష్ట్ర అసెంబ్లీ బుధవారం రోజున యాచక నిషేధ బిల్లు 2025ను ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలో భిక్షాటన నిషేధించడంతో పాటు భిక్షాటన చేసేవారికి పునరావాసం అలాగే జీవనోపాధిని కల్పించనున్నట్లు తెలిపింది. 

అయితే ఈ బిల్లును ప్రవేశపెడుతూ సాంఘిక సంక్షేమం, మహిళా, శిశు అభివృద్ధి మంత్రి లాల్రిన్‌పుయి మాట్లాడుతూ భిక్షాటన  నిషేధించడమే కాకుండా వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యాచకులకు సహాయం చేయడం, పునరావాసం కల్పించడమే ముఖ్య ఉద్దేశం అని అన్నారు. మిజోరాంలో ప్రస్తుతం చర్చిలు, NGOలు, సంక్షేమ పథకాల కారణంగా చాలా తక్కువ మంది యాచకులు ఉన్న కూడా రానున్న రోజుల్లో యాచకం పెరిగే అవకాశం ఉందని ఉన్నారు.  

సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సైరంగ్-సిహ్ముయ్ వద్ద కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభించనున్నారు. దింతో మిజోరం బయటి   నుండి యాచకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు లాల్రిన్‌పుయి అసెంబ్లీకి తెలిపారు .సరైన నియంత్రణ చట్రాలు అమలులో ఉంటే రాష్ట్రం యాచకుల నుండి విముక్తి పొందగలదని ప్రభుత్వం నమ్ముతున్నట్లు చెప్పారు.

►ALSO READ | సెప్టెంబర్‌లో మారుతున్న రూల్స్.. ఆధార్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు.. తప్పక తెలుసుకోండి..

ఈ చట్టంలో భాగంగా బిచ్చగాళ్ళు  తాత్కాలికంగా ఉండడానికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి సహాయ బోర్డును ఏర్పాటు చేస్తుంది. అలాగే 24 గంటల్లోపు వారిని స్వస్థలాలకు లేదా సొంత రాష్ట్రాలకు తిరిగి పంపే ముందు, బిచ్చగాళ్లను మొదట ఈ కేంద్రాలలో ఉంచుతామని వెల్లడించింది. సాంఘిక సంక్షేమ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం ఐజ్వాల్‌లో స్థానికులతో సహా 30 మందికి పైగా బిచ్చగాళ్ళు ఉన్నట్లు తెలిసింది.

అయితే, ప్రతిపక్షాలు ఈ చర్యను విమర్శించాయి. ఈ బిల్లు క్రైస్తవ మత నమ్మకానికి  హానికరమని, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రమాదం ఉందని MNF శాసనసభ్యుడు లాల్‌చందమా రాల్టే వాదించారు. అయితే 13 మంది సభ్యులతో చర్చల తర్వాత ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.