సెప్టెంబర్‌లో మారుతున్న రూల్స్.. ఆధార్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు.. తప్పక తెలుసుకోండి..

సెప్టెంబర్‌లో మారుతున్న రూల్స్.. ఆధార్ నుంచి క్రెడిట్ కార్డ్స్ వరకు.. తప్పక తెలుసుకోండి..

September Rules 2025: ప్రతినెల మాదిరిగా సెప్టెంబర్ 2025 నుంచి కొన్ని కీలకమైన మార్పులు వస్తున్నాయి. వీటి అమలుతో ఆర్థికంగా ప్రజలపై ఉండే ప్రభావం గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవటం ముఖ్యం. బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల నుంచి ఆర్థిక సంస్థలు, పన్ను విషయంలో అమలులోకి వస్తున్న కొత్త రూల్స్ ఎలా ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం తప్పక తెలుసుకోవాలి ప్రజలు. 

* ముందుగా ఆదాయపు పన్ను రిటర్స్న్ దాఖలుకు సంబంధించి వాస్తవ డెడ్ లైన్ సెప్టెంబర్ 15కి మార్చబడినందున గడువులోపు ఐటీఆర్ ఫైల్ చేయటం కీలకమని గుర్తుంచుకోండి. అకౌంట్స్ ఆడిటింగ్ అక్కర్లేని పన్ను చెల్లింపుదారులకు ఈ రిటర్న్ ఫైలింగ్ గడువు చివరి తేదీ అక్టోబర్ 31, 2025 అను గుర్తుంచుకోండి. 

* కొత్త నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక అంశం ఒకటి ఉంది. కొత్త పెన్షన్ విధానం కింద ఉన్న వ్యక్తులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కిందకు మారేందుకు ఎంపిక చివరి గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుందని ఉద్యోగులు గమనించాలి.

* సెప్టెంబర్ 1 నుంచి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను కూడా స్పీడ్ పోస్టులో కలిపేస్తుందని గమనించాలి. దీంతో దేశంలో ఎక్కడికైనా మీరు రిజిస్టర్డ్ పోస్ట్ పంపితే అది స్పీడ్ పోస్ట్ కింద డెలివరీ చేయబడుతుందని గమనించాలి.

* దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల రూల్స్ సెప్టెంబర్ 1 నుంచి మారతాయని యూజర్లకు వెల్లడించింది. దీంతో వారు పొందుతున్న రివార్డ్ పాయింట్స్ ప్రోగ్రామ్ లో మార్పులు రాబోతున్నాయి. డిజిటల్ గేమ్స్, ప్రభుత్వ వెబ్ సైట్లలో చేసే పేమెంట్స్ పై కార్డుదారులు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ పొందరని ఎస్బీఐ తెలిపింది. 

►ALSO READ | ట్రంప్ టారిఫ్స్: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో Coca-Cola, PepsiCo నిషేధం..!

* ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు ఇండియన్ బ్యాంక్ 444 రోజుల, 555 రోజుల.. , ఐడిబిఐ బ్యాంక్స్ 444 రోజుల, 555 రోజుల, 700 రోజుల కాలానికి చేసే స్పెషల్ ఫిక్స్ డ్ డిపాజిట్లను కేవలం సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపాయి. 

* ఇక చివరిగా దేశంలోని ప్రజలు తమ ఆథార్ వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు ఉచిత సౌకర్యాన్ని 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. కార్డులోని వివరాల్లో ఉండే తప్పులను సరిదిద్దటానికి ఇది అవసరమని సంస్థ వెల్లడించింది.