పోస్టాఫీసులో సీబీఐ దాడులు..సూపరింటెండెంట్​ సూసైడ్​

పోస్టాఫీసులో సీబీఐ దాడులు..సూపరింటెండెంట్​ సూసైడ్​
  • ఉత్తరప్రదేశ్​లో దారుణం

బులంద్‌‌‌‌‌‌‌‌షహర్‌‌‌‌‌‌‌‌: కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఫిర్యాదుతో సీబీఐ అధికారులు ఓ పోస్టాఫీసుపై దాడి చేయగా.. మరుసటి రోజు ఆ పోస్టాఫీసు సూపరింటెండ్ సూసైడ్​చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్​లోని బులంద్‌‌‌‌‌‌‌‌షహర్​లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బులంద్‌‌‌‌‌‌‌‌షహర్‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన పోస్టాఫీసులో కోట్లాది రూపాయల స్కాం జరగడంతో పాటు ఉద్యోగులపై లంచం ఆరోపణలు రావడంతో.. సీబీఐ, అవినీతి నిరోధక విభాగం అధికారులు మంగళవారం అర్ధరాత్రి ఆ పోస్టాఫీసుపై దాడి చేశారు.

అయితే, ఆ పోస్టాఫీసు సూపరింటెండెంట్ త్రిభువన్ ప్రతాప్ సింగ్ బుధవారం ఉదయం అలీగఢ్‌‌‌‌‌‌‌‌లోని తన ఇంట్లో పిస్టల్‌‌‌‌‌‌‌‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఒత్తిడి వల్లే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.