చలిగాలుల కారణంగా ఉత్తరప్రదేశ్‭లో స్కూళ్లు బంద్

చలిగాలుల కారణంగా ఉత్తరప్రదేశ్‭లో స్కూళ్లు బంద్

ఉత్తరప్రదేశ్‭లో చలిగాలుల తీవ్రత కారణంగా స్కూళ్లకు శీతాకాల సెలవులను పొడిగించారు. చలి, పొగమంచు కారణంగా వారణాసిలోని పలు పాఠశాలలకు ఈనెల 4 వరకు సెలవులు ప్రకటించారు. 1 నుండి 8వ తరగతి వరకు ఉన్న అన్ని స్కూళ్లను ఈనెల 4 వరకు మూసివేయనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఎస్ రాజలింగం వెల్లడించారు. అంగన్ వాడీ కేంద్రాలను కూడా మూసివేయనున్నట్లు ఎస్ రాజలింగం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు, బీసీఎస్సీ బోర్డు, ఐసీఎస్ఈ బోర్డు, మదర్సా బోర్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. ఇక లక్నోలోని గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు క్లాసులు జరుగుతాయని లక్నో మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది. 

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రానున్న ఐదు రోజుల్లో పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‭లో దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.