టీచర్లా.. యాక్టర్లా : చదువులు చెప్పకుండా రీల్స్ పాఠాలు

టీచర్లా.. యాక్టర్లా : చదువులు చెప్పకుండా రీల్స్ పాఠాలు

విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్లు.. రీల్స్ పాఠాలు చెప్తున్నారు. ఫేమస్ అవ్వాలనే పిచ్చిలో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్లో తన రీల్స్ ను లైకులు, షేర్ చేయమని.. తన ఖాతాను సబ్ స్క్రైబ్ చేయమని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ టీచర్ల రీల్స్ పిచ్చి రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో భరించలేక విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో టీచర్స్ రీల్స్ స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని ఆమ్రోహ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో  జరిగింది. వివరాల్లోకి వెళితే.. 

ఆమ్రోహ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు.. అంబికా గోయల్, పునమ్ సింగ్, నీతూ కశ్యప్ లకు వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమంటే యమక్రేజ్.. ఇంటా, బయట, స్కూల్ ఇలా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ క్రియేట్ చేస్తుంటారు. రీల్స్ ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల ప్లాట్ ఫారమ్ లో పోస్ట్ చేసి వచ్చే లైకులు, షేర్లు చూసి తెగ ఆనంద పడిపోతుంటారు.

ఈ పిచ్చి కాస్త ముదిరి విద్యార్థులపై వత్తిడి తెచ్చేస్థాయికి చేరింది. మా పోస్టులు లైక్ చేయాలి.. షేర్ చేయాలి.. మా అకౌంట్లు సబ్ స్క్రైబ్ చేయాలని విద్యార్థులను ఒత్తిడి తెస్తూ ఇబ్బంది పెడుతున్నారు. వీరి బాధ భరించలేక విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో రీల్స్ టీచర్లు అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ లపై విద్యాధికారికి కంప్లైంట్ చేయడంతో విషయం బయటికొచ్చింది. 

విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు రీల్స్ మోజులో పడి లెసన్స్ చెప్పడం నిర్లక్ష్యం చేస్తున్నారని.. సెలబస్ పూర్తి చేయడం లేదని విద్యార్థులనుంచి ఆరోపణలు కూడా వచ్చాయి.. దీంతో వారిపై చర్యలు తీసుకుంటామని విద్యాధికారి చెప్పారు.