ఆగస్టు 16 నుంచి కాలేజీలు ప్రారంభం

ఆగస్టు 16 నుంచి కాలేజీలు ప్రారంభం

ఉత్తరప్రదేశ్ లో ఈ నెల(ఆగస్టు) 16 నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వం..వచ్చే నెల (సెప్టెంబర్) ఒకటవ తేది నుంచి కాలేజీలు,వర్శిటీలను తెరవనున్నట్లు తెలిపింది. ఇంటర్ కాలేజీలను 50 శాతం కెపాసిటీతో ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. కాలేజీలు, వర్సిటీల్లో ఆగస్టు 5వ తేదీ నుంచి విద్యార్థుల ప్రవేశ ప్రక్రియ మొదలుపెట్టే విధంగా ఆదేశాలు ఇచ్చారు అధికారులు. 

కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూత పడ్డాయి. ఇప్పటికే హిమాచల్‌, పంజాబ్‌, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఇంటర్ కాలేజీలను ఓపెన్ చేశారు.