యూపీ మహిళకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

యూపీ మహిళకు వాట్సాప్ ద్వారా ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

ముస్లిం మహిళల కోసం కేంద్రం ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకొచ్చినా కొందరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా యూపీలోని అలీగఢ్ జిల్లాల్లోని షాజమాల్ కాలనీకి చెందిన 27 ముస్లిం మహిళకు తన భర్త సౌదీ నుంచి వాట్సాప్ లో ట్రిపుల్ తలాక్ ఇచ్చాడు. దీంతో అతనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కట్నం విషయంలో తమ మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని ఆమె చెప్పింది. 

ఇల్మా ఖాన్ అనే మహిళ 2018లో అబ్దుల్ రషీద్‌ను వివాహం చేసుకుంది. అబ్దుల్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ఏడాది క్రితం తాను కూడా సౌదీ వెళ్లి భర్తతో ఉండటానికి వీసా పంపిస్తానని ఇల్మాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆమెను తీసుకువెళ్లేందుకు నిరాకరించాడు. పైగా.. వాట్సాప్ ద్వారా తనకు ట్రిపుల్ తలాక్ లేఖను పంపాడు. తాను తలాక్ ను అంగీకరించడం లేదని ఇల్మా ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడి  చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరింది. మహిళ ఫిర్యాదు స్వీకరించిన డీఎస్పీ అశోక్ కుమార్ సింగ్ దర్యాప్తు చేస్తున్నారు.