చెత్త మనుషులు.. చెత్త ఆలోచనలు అని ఊరికే అనలేదు.. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయే విధంగా ఇటీవల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం డియోరియాలోని బలువాని ప్రాంతంలో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. వరుడి పేరు విశాల్ మధేసియా. సాలెంపూర్ ప్రాంతానికి చెందిన పూజ అనే అమ్మాయితో 2025, నవంబర్ 25వ తేదీ పెళ్లి జరిగింది. రెండు కుటుంబాలు మాట్లాడుకుని.. ఒకరికి ఒకరు నచ్చిన తర్వాతనే.. 40 రోజుల తర్వాత పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. అనుకున్నట్లుగానే పెళ్లి జరిగింది.
పెళ్లి వేడుక ముగిసిన తర్వాత విశాల్, పూజ ఇంటికి వచ్చారు. పూజ అత్తాగారింటికి వచ్చింది. కొత్త కోడలుకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.. ఇంట్లో అడుగు పెట్టిన కొత్త కోడలుకు ఓ గది ఇచ్చారు. ఆ గదిలోకి వెళ్లిన పూజ.. 20 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నేను మా ఇంటికి వెళ్లిపోతాను.. నేను ఇక్కడ ఉండను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేసింది. ఇంట్లో ఉన్న బంధువులు, చుట్టాలు అంటూ షాక్. ఏదో కామెడీ చేస్తుంది.. ప్రాంక్ చేస్తుంది అని అందరూ భావించారు. మేటర్ సీరియస్.. కామెడీ కాదు.. నేను నిజంగానే చెబుతున్నాను.. నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అంటూ గొడవకు దిగింది.
Also Read : భద్రత కోసమే కానీ బలవంతం కాదు
విషయం పూజ తల్లిదండ్రులకు చెప్పటంతో.. వాళ్లందరూ వచ్చారు. పంచాయితీ పెట్టారు. ఐదు గంటలు ఊరు పెద్దలు పూజకు నచ్చచెప్పారు. ససేమిరా అన్నది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే లేదు అని తేల్చి చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కలిసి ఉండటం కష్టం అని భావించిన కొత్త పెళ్లి కొడుకు విశాల్.. విడిపోవటానికే నిర్ణయించుకున్నాడు. బలవంతంగా ఇంట్లో ఉంచుకుంటే రాబోయే రోజుల్లో చంపినా చంపొచ్చు అని భయపడ్డాడు. రోజూ గొడవ పడేకంటే ఒకే రోజు సంబంధాన్ని తెంచుకుంటే బెటర్ అనుకున్నాడు. పెళ్లి కొడుకు విశాల్ అండ్ ఫ్యామిలీ ఓకే చెప్పింది.
దీంతో గ్రామంలోని పెద్దలు కట్నకానుకల కింద ఇచ్చిన డబ్బు, నగదు, వస్తువులు, ఇతర పెట్టుబడులు అన్నింటినీ ఎవరికి వాళ్లు ఇచ్చిపుచ్చుకున్నారు. పెళ్లి ఖర్చులను అమ్మాయి ఫ్యామిలీ వాళ్లు భరించాలని తీర్మానం చేసి.. పెళ్లి పెటాకులు అయ్యింది.. ఇక ఎవరికి వాళ్లే.. మీ ఇష్టం ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోండి అని తీర్మానించారు.
దీనిపై పెళ్లి కొడుకు విశాల్ మాట్లాడుతూ.. పెళ్లి నిర్ణయం అయిన తర్వాత 40 రోజుల సమయం ఉందని.. అప్పుడు ఎప్పుడూ ఇలా చెప్పలేదని.. చాలా తక్కువగా మాట్లాడిందని.. ఇష్టం లేకుండా ఎందుకు చేసుకున్నావు అంటూ ప్రశ్నిస్తున్నాడు. ఈ విషయంపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చే ఉద్దేశం లేదని వివరించాడు విశాల్. అబ్బాయి తరపు వాళ్లు కూడా పెళ్లి కూతురుపై మండిపడుతున్నారు. ముందే చెప్పొచ్చు కదా.. పెళ్లి జరిగిన తర్వాత.. అత్తారింట్లో అడుగు పెట్టిన 20 నిమిషాల్లోనే ఇంత పంచాయితీ చేయాలా అంటూ అమ్మాయి తరపు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి పెళ్లి తర్వాత ఇలాంటి ఘటనలు ఇప్పుడు కామన్ అయిపోతున్నాయి.. అదేదో ముందే చెప్పొచ్చు కదా అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.
