బొడ్డు తాడు దాచనున్న ఉపాసన.. బిడ్డ కోసం ఎన్ని జాగ్రత్తలో

బొడ్డు తాడు దాచనున్న ఉపాసన.. బిడ్డ కోసం ఎన్ని జాగ్రత్తలో

మెగా కోడలు ఉపాసన కొణిదెల(Upasana Konidela) తనకు పుట్టబోయే బిడ్డకోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పడు ఉపాసనకు ఎనిమిదవ నెల. మరికొన్ని రోజుల్లో ఆమె డెలివరీ కానుంది. అయితే తాజాగా ఆమె తనకు పుట్టబోయే బిడ్డ కోసం కీలక నిర్ణయం తీసుకుందట.

అదేంటంటే.. ఆమె తన బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది. తాజాగా ఉపాసన దీనిగురించి వివరిస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది.

స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే బొడ్డు తాడు దాచుకోవడం. నిజానికి దీని గురించి చాలా మందికి తెలియదు. పిల్లలు పుట్టినప్పుడు బొడ్డు తాడు దాచడం వల్ల.. పెద్దయ్యాక వాళ్ళకు అది ఉపయోగపడుతుంది. ఎన్నోరకాల చికిత్సల కోసం దీనిని వినియోగించవచ్చు. గతంలో మహేశ్ బాబు(Mahesh babu) సతీమణి నమ్రత(Namratha) కూడా తమ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.