పెళ్లయిన పదేళ్లకు ప్రెగ్నెన్సీ రావడానికి కారణం అదే: ఉపాసన

పెళ్లయిన పదేళ్లకు ప్రెగ్నెన్సీ రావడానికి కారణం అదే: ఉపాసన

పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంపై హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన స్పందించారు.  సమాజం కోరుకున్నప్పుడు కాకుండా తాను కావాలనుకున్నప్పుడు గర్భం దాల్చడం ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉందని చెప్పారు. పెళ్లైన పదేళ్ల తర్వాతే పిల్లల్ని కనాలని తాము అనుకున్నామని..ఇపుడు సరైన సమయం వచ్చిందన్నారు. చరణ్,తాను తమ రంగాల్లో ఎదిగామని, ఆర్థికంగా నిలదొక్కుకున్నామని  వెల్లడించారు. తమ పిల్లలకు కావాల్సినవన్నీ ఇచ్చే స్థాయికి తాము చేరామని తెలిపారు. 

రామ్ చరణ్,ఉపాసనకు 2012 జూన్ 14న పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లు  2023 డిసెంబర్ 12న ఇరు కుటుంబాలు ప్రకటించాయి. తన డెలివరీ కూడా ఇండియాలోనే జరుగుతుందని ఉపాసన ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.  

పెళ్లయిన కొత్తలో తాను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్లు ఉపాసన ఇటీవల చెప్పారు.  తాను అందంగా లేనని,లావుగా ఉన్నావని కొందరు కామెంట్ చేశారని తెలిపారు. రామ్ చరణ్ తనను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నారని  మాట్లాడారని..అయినా తాను కుంగిపోలేదని ధైర్యంగా ఉన్నానని ఉపాసన వెల్లడించారు.