
మెగా కోడలు ఉపాసన కొణిదెల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రెగ్నెంట్ మహిళలు అందులోనూ సింగల్ మథర్స్ కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అపోలో హాస్పిటల్స్.. చిన్న పిల్లల కోసం అపోలో చిల్డ్రన్స్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. ఈ విభాగానికి సంభందించిన ప్రత్యేక లోగోను అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడిన ఆమె.. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అందరూ నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. ఆశీర్వాదాలను కూడా అందించారు. నా ప్రెగ్నెన్సీ ప్రయాణాన్ని అద్భుతమైన జ్ఞాపకంగా చేసిన ప్రతీఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియచేకుంటున్నాను.
ఇక ఈ అపోలో పీడియాట్రిక్, అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ప్రతీ తల్లికి ప్రెగ్నెన్సీ అనేది ఓ ఎమోషనల్ జర్నీ. వారిని ఎంతో క్షేమంగా చూసుకుంటున్న డాక్టర్స్‌కు ధన్యవాదాలు. నా ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చాలా మంది వారి వారి సలహాలను నాకు అందించారు. కానీ కొందరి మహిళలకు ఇలాంటి సపోర్ట్ దొరకదు. మరీ ముఖ్యంగా సింగిల్ మదర్స్‌కు. అందుకే అపోలో వైస్ చైర్‌పర్సన్‌గా నేను ఓ ప్రకటన చేయాలనుకుంటున్నాను. ఇక నుండి ప్రతీ వీకెండ్స్‌లో సింగిల్ మదర్ పిల్లలకు ఉచితంగా ఓపీడీ చికిత్సలు అందించాలని నిర్ణయించుకున్నాం. వారికి నా వంతు సహాయం అందిచటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రకటన చేయటానికి చాలా గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు ఉపాసన. తెలిపింది. ఇక ఉపాసన తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో చాలా మంది ఉపాసనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.