
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల కృష్ణ బర్త్ డే సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన వీడియో గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ స్టైలిష్ లుక్, యాటిట్యూడ్, మాస్ అప్పియరెన్స్ ఆకట్టుకున్నాయి. మొదటిరోజునే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ అందుకుని టాలీవుడ్‌లో హైయస్ట్ వ్యూస్ అందుకున్న గ్లింప్స్‌గా నిలిచింది.
ఐదు రోజుల్లో 28.4 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే.. ఈనెల పన్నెండు నుండి ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలవబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో తీయబోతున్నారట. హీరోయిన్ శ్రీలీల కూడా షూట్‌లో జాయిన్ అవనున్నట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 13న సినిమా విడుదల కానుంది. ఇక ఆగస్టులో మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా మరో టీజర్‌ను విడుదల చేయనున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.