సందేశాత్మక కథతో.. ఉపేంద్ర గాడి అడ్డా

సందేశాత్మక కథతో.. ఉపేంద్ర గాడి అడ్డా

కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’.  డిసెంబర్ 1న సినిమా రిలీజ్.  ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ ‘ఇదొక యూత్ ఫుల్, మాస్  ఎంటర్ టైనర్. మంచి మెసేజ్ కూడా ఉంది. సోషల్ మీడియా ఉపయోగించే విధానంలో మంచి, చెడులు చూపించాం. ముఖ్యంగా మహిళలపై ఎలా ప్రభావితం చేస్తుంది.. సమాజంలో విలువలు ఏవిధంగా ఉన్నాయో చూపించాం. 

కొత్త సినిమా అనికాకుండా మంచి సినిమాగా తీశాం. ఒక కొత్త హీరో ప్రేక్షకులకు దగ్గరయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి.  నన్ను హీరోగా పెట్టి, మా నాన్న ఆరు సినిమాలు ఒకేసారి తీస్తుండటం నా అదృష్టం. ఇప్పటికే నాలుగు సినిమాలు 70 శాతం పూర్తయ్యాయి. నెలకొక సినిమా చొప్పున రిలీజ్‌‌కు రెడీ చేస్తాం. నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘1920 భీమునిపట్నం’ చిత్రం నా కెరీర్‌‌‌‌కు టర్నింగ్ అవుతుంది. ఈ  చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించడం మర్చిపోలేని అనుభూతి’ అని చెప్పాడు.