ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయి : పోలీసుల విచారణ

ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న హిందూ అబ్బాయి : పోలీసుల విచారణ

యూపీలో స్థానిక హిందూ యువకుడు ముస్లిం యువతితో వివాహం చేసుకున్నట్లు చెప్పబడుతున్న 'నికా' వేడుకను చూపించే ఓ వైరల్ వీడియోపై కాన్పూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాలోని చౌబేపూర్ ప్రాంతానికి చెందిన దంపతులు గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. “మేము దంపతుల కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే ఈ వీడియో కొన్ని నెలల క్రితం పట్టణ ప్రాంతంలో జరిగిన వేడుకకు సంబంధించినది అని చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సంజయ్ పాండే అన్నారు.

నిష్పక్షపాతంగా విచారణ జరిపి మతమార్పిడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కన్వీనర్ విపిన్ శుక్లా ఆధ్వర్యంలో చౌబేపూర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు చేపట్టారు. “ఒక హిందూ యువకుడు మతం మార్చుకుని ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీనిపై విచారణ జరపాలి. దీని వెనుక ఏదో కుట్ర ఉంది' అని శుక్లా అన్నారు. స్థానికుల ప్రకారం, సంఘటన నాలుగు నెలల క్రితందని స్థానిక హిందూ బాలుడు పొరుగున ఉన్న మైనర్ ముస్లిం బాలికతో పారిపోయాడని పోలీసులు తెలిపారు.

ALSO READ : నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా.. ఎవరొస్తారో రండి చూస్కుందాం..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరూ గతంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారని, అయితే ఆ తర్వాత హిందూ యువకుడు.. మతం మారి ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. తొలుత తమ మైనర్ కుమార్తెను యువకుడు అపహరించినట్లు బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోందని స్టేషన్ ఇన్‌ఛార్జ్ చెప్పారు.