గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్స్ లో నిజంగా ట్యాక్స్ పడుతుందా.. వాస్తవం ఏంటీ?

గూగుల్ పే, ఫోన్ పే పేమెంట్స్ లో నిజంగా ట్యాక్స్ పడుతుందా.. వాస్తవం ఏంటీ?

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం మొదలైన యూపీఐ యాప్స్ ద్వారా రూ. 2 వేలకు పైగా లావాదేవీలు చేస్తే ఏప్రిల్ 1 నుంచి ఆయా పేమెంట్స్‌పై ఛార్జీలు విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్స్ వాడుతున్న వారిలో ఆందోళన నెలకొంది. అయితే నిజానికి ఈ ఛార్జీలు యూజర్లకు వర్తించవు. ఓ వాలెట్ నుంచి మర్చంట్ కు ట్రాన్సక్షన్ చేస్తే నగదు రిసీవ్ చేసుకున్న బ్యాంక్/పేమెంట్ యాప్ కొంత మొత్తం వాలెట్ కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు కేటగిరీ బట్టి 0.5% నుంచి 1.1% వరకు ఉంటుంది.

అటు ఈ వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఖండించింది. "ఉచితంగా, ఫాస్ట్‌గా, సెక్యూర్‌గా, వేగంగా జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఇటీవలి కాలంలో యూపీఐ అత్యంత ఆధారణ పొందుతోంది. యూపీఐ యాప్ ద్వారా బ్యాంక్‌కు లింక్ చేసి పేమెంట్స్ చేస్తున్న లావాదేవీలో 99.9 శాతం ఉన్నాయి. ఇలా బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బులు పంపిస్తున్న లావాదేవీలు ఇప్పటికీ కస్టమర్లకు, మర్చంట్లకు పూర్తిగా ఉచితం" అని తెలిపింది.