బ్యాచిలర్స్ కి బెస్ట్ ఛాయిస్..ఏఐ కుకింగ్ అసిస్టెంట్‌‌

బ్యాచిలర్స్ కి బెస్ట్ ఛాయిస్..ఏఐ కుకింగ్ అసిస్టెంట్‌‌

బ్యాచిలర్స్‌‌ చాలామంది వారంలో మూడు రోజులు వంట చేసుకుంటే మరో నాలుగు రోజులు బయటి ఫుడ్​ తింటారు. అలాంటి వాళ్లకు ఈ కుకింగ్ అసిస్టెంట్‌‌ బెస్ట్‌‌ ఛాయిస్‌‌. దీన్ని అప్‌‌లియన్స్‌‌ స్టోర్ అనే కంపెనీ తయారుచేసింది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​తో పనిచేసే ఈ గాడ్జెట్‌‌ వంట చేయడంలో చాలా సాయం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వండుకునే టాప్‌‌ 500కుపైగా వంటకాల డాటా ఉంటుంది ఇందులో.  

వాటితోపాటు ప్రతి వారం కొత్త వంటకాలు యాడ్‌‌ అవుతుంటాయి. అంతేకాదు ఇందులో ఉండే స్మార్ట్ జార్‌‌‌‌ కూర గాయలను కట్‌‌ చేయడం, కూర వండేటప్పుడు కలపడం లాంటివి కూడా చేస్తుంది. ఏ వంట వండుతున్నా అందులో ఎప్పుడు? ఏం వేయాలో డిస్‌‌ప్లేలో చూపిస్తుంటుంది. కొన్న దగ్గరినుంచి ఏడు సంవత్సరాల వరకు సాఫ్ట్‌‌వేర్ అప్‌‌డేట్స్ వస్తుంటాయి. హైదరాబాద్‌‌తోపాటు ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఐపీ 64 రేటెడ్ వాటర్, మసాలా రెసిస్టెంట్ టచ్‌‌స్క్రీన్ ఉంది. 

ధర : 23,999 రూపాయలు