Upload: చనిపోయాక జీవితం.. OTTలో మైండ్ బ్లాక్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

Upload: చనిపోయాక జీవితం.. OTTలో మైండ్ బ్లాక్ చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

మనిషి తన మేధా శక్తితో ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నాడు. కానీ, చావు, చనిపోయిన తరువాత ఎం జరుగుతుంది అనే విషయాన్నీ మాత్రం తెలుసుకోలేకపోయాడు. అందుకే తన ఊహా శక్తితో చావు అనే విషయం గురించి, ఆతరువాత జరిగే విషయాల గురించి సినిమాలు తీస్తున్నారు. ఆ కాన్సెప్ట్ తో ఇప్పటివరకు చాలా భాషల్లో, చాలా సినిమాలే వచ్చాయి. అలా వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అప్ లోడ్. 

చనిపోయాక బ్రతకడం అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం. తెరకెక్కింది. ఈ హాలీవుడ్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇప్పటికే రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చనిపోయిన మనిషికి మరో లోకం ఉంటే, అక్కడ వారితో పరిచయం ప్రేమ ఇలా సరికొత్తగా ముందుకు సాగుతుంది. మొత్తం 7 ఎపిసోడ్స్ గా ఉండే ఈ సిరీస్..  చాలా గ్రిప్పింగ్ గా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తుంది. వీలుంటే మీరు కూడా చూసేయండి.

ఇక అప్లోడ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. నాథన్ బ్రౌన్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ఇంగ్రిడ్(అలెగ్ర ఎడ్వర్డ్స్) అనే రిచ్ అమ్మాయి ప్రేమిస్తుంది. అనుకోని కారణాల వల్ల నాథన్ కూడా ఆమె ప్రేమించాల్సి వస్తుంది. చాలా సార్లు బ్రేకప్ చెప్పాలనుకుంటాడు కానీ, చెప్పలేకపోతాడు. అనుకోకుండా ఒకరోజు నాథన్ కు ప్రమాదం జరుగుతుంది. బతకడని వైద్యులు చెప్తారు. దాంతో.. నాథన్ ను అప్లోడ్ చేయాలనీ ఫిక్స్ అవుతుంది ఇంగ్రిడ్. అప్ లోడ్ చేయడం అంటే జ్ఞాపకాలను డిజిటలైజ్ చేయడం. అందుకోసం నాథన్ ను ఒక రిసార్ట్ లో ఉంచుతారు. అక్కడ అప్ లోడ్స్ కి సహాయకులుగా ఏంజెల్స్ అంటారు. అలా నాథన్ కు నోరా ఆంటోనీ(అండి అల్లో) ఏంజెల్ పరిచయం అవుతుంది. అలా వారి మధ్య స్నేహం, ప్రేమ మొదలవుతాయి. మరి ఇంగ్రిడ్ ప్రేమ ఏమైంది? నోరాతో నాథన్ ప్రేమ ఎంతవరకు కొనసాగుతుంది? అసలు అప్ లోడ్ వల్ల ఉపయోగం ఏంటి? అనేది మిగిలిన కథ.