నత్తనడకన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు .. నిరసిస్తూ సీపీఎం నిరాహార దీక్ష

నత్తనడకన ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు .. నిరసిస్తూ సీపీఎం నిరాహార దీక్ష

ఉప్పల్, వెలుగు: ఉప్పల్​– నారపల్లి ఫ్లైఓవర్​ పనులు నత్తనడకన సాగుతున్నాయని సీపీఎం నాయకులు ఆరోపించారు. సోమవారం ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వారు నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి మాట్లాడారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పనులకు ఏడేండ్ల క్రితం శంకుస్థాపన చేస్తే.. ఇప్పటివరకు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. బీజేపీ తరఫున మన రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా ఈ విషయాన్ని ఎందుకు కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం లేదని ప్రశ్నించారు. పనులు త్వరగా పూర్తిచేయకుంటే ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీస్తామని హెచ్చరించారు.