ఉప్పల్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో భారీ వాహనాలపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్..
- ఘట్కేసర్ నుంచి ఉప్పల్వైపు వెళ్లే భారీ వాహనాలను ఉప్పల్ భగాయత్ (హెచ్ఎండీఏ లేఅవుట్) వద్ద మళ్లిస్తారు.
- ఎల్బీనగర్ నుంచి తార్నాక వైపు వాహనాలు.. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకుని భగాయత్ లేఅవుట్ మీదుగా ఉప్పల్ టయోటా వద్దకు చేరుకోవాలి.
- తార్నాక వెళ్లే వారు చెంగిచర్ల, ఐఓసీఎల్, చర్లపల్లి మీదుగా ప్రయాణించాలి.
- రామంతాపూర్ నుంచి ఉప్పల్వైపు వెళ్లే వాహనాలను స్ట్రీట్ నం.8 నుంచి హబ్సిగూడ, నాచారం, ఎన్ఎఫ్సీ, చెంగిచర్ల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
- వరంగల్ నుంచి వచ్చే భారీ వాహనాలు ఘట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ మీదుగా ప్రయాణించాలి.
పార్కింగ్ ఏరియాలు
- స్టేడియం సమీపంలో ఆడియన్స్ కోసం 5 ప్రదేశాల్లో పార్కింగ్ కేటాయించారు.
- ఎల్బీనగర్/రామంతాపూర్ వైపు నుంచి వచ్చేవారు.. డీఎస్ఎల్ ఓపెన్ ప్లేస్, మోడర్న్ బేకరీ వద్ద పార్క్ చేయాలి.
- తార్నాక/హబ్సిగూడ వైపు నుంచి వచ్చేవారు: పెంగ్విన్ టెక్స్టైల్స్, టీజీ ఐలా వద్ద కేటాయించిన స్థలాల్లో వాహనాలు నిలపాలని పోలీసులు సూచించారు.
