న్యూ ఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విఫలమైంది. మంగళవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 155 పరుగులు మాత్రమే చేసింది. మొదట బ్యాటింగ్చేపట్టిన ఢిల్లీ బ్యాటర్లు వరుసగా అవుటయ్యారు. ఈ క్రమంలో సమీర్రిజ్వి (24 బంతుల్లో 4 సిక్సర్లతో 40 నాటౌట్), స్టబ్స్(31 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 38) పరుగులు చేయడం వల్ల ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతవారందరూ కనీసం 20 పరుగుల మార్క్‌ను కూడా చేరుకోలేదు.
చెన్నై బౌలర్నూర్అహ్మద్22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై (17.3) ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సంజు శాంసన్( 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లతో 87), కార్తీక్‌శర్మ (31 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్స్‌లతో41) చెలరేగి ఆడారు. శాంసన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
టాప్ ఆర్డర్ విఫలం
టాస్‌గెలిచి బ్యాటింగ్చేపట్టిన ఢిల్లీ ఆదినుంచే తడబడింది. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో పరుగులు సాధించడం కష్టతరమైంది. ముకేశ్ చౌదరి వేసిన స్లో బంతిని పాథుమ్ నిస్సాంక (19) సరిగ్గా అంచనా వేయలేక మిడ్-ఆన్‌లో క్యాచ్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ (12) సైతం అఖీల్ హొసేన్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
పవర్ ప్లే ముగిసే సమయానికి ఢిల్లీ 2 వికెట్ల నష్టానికి 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పిన్నర్ నూర్ అహ్మద్ తన బౌలింగ్‌తో కరుణ్ నాయర్, నితీశ్ రాణాను పెవిలియన్‌కు పంపాడు. కెప్టెన్ అక్సర్ పటేల్ (7) పేలవమైన షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు.11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 69 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (38), ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ (40 నాటౌట్) ధాటిగా ఆడి స్కోరును గౌరవప్రదమైన స్థితికి చేర్చారు. ఈ జోడీ 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా తొలి అర్ధభాగంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేకపోయారు. చెన్నై బౌలర్లు నిలకడగా రాణిస్తూ పరుగులు కట్టడి చేయడంలో సక్సెస్అయ్యారు.
చెలరేగిన శాంసన్
లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా ఆడారు. తొలి ఓవర్లో 3 పరుగులు మాత్రమే సాధించారు. అక్షర్ పటేల్ వేసిన రెండో ఓవర్ లో శాంసన్ సిక్స్ బాదాడు. ఈ ఓవర్లో 15 పరుగులు రాబట్టారు. లుంగి ఎంగిడి వేసిన నాలుగో ఓవర్లో రుతురాజ్(6) అశుతోష్‌కు క్యాచ్ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో జట్టు స్కోరు 24 పరుగుల వద్ద చెన్నై తొలి వికెట్‌ను కోల్పోయింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ ఎంగిడి వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్స్‌లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. అనంతరం అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో ఉర్విల్(17) స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. పది ఓవర్లకు చెన్నై 2 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.
కుల్దీప్యాదవ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టిన శాంసన్32 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం వేగం పెంచిన శాంసన్ (52 బంతుల్లో 87), కార్తీక్‌శర్మ (31 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. 66 బంతుల్లో 114 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో చెన్నై 17.3 ఓవరల్లో 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అక్సర్పటేల్, లుంగి ఎంగిడి ఒక్కో వికెట్తీశారు.
సంక్షిప్త స్కోరు:
ఢిల్లీ: 20 ఓవర్లలో 155/7 (సమీర్ రిజ్వి 40 నాటౌట్, స్టబ్స్38, నూర్ అహ్మద్22/2 )
చెన్నై: 17.3 ఓవరల్లో 159/2 (సంజు శాంసన్87 నాటౌట్, కార్తీక్ శర్మ నాటౌట్41,
అక్సర్ పటేల్ 25/1
