ఓడిపోతే ఈవీఎంలను నిందిస్తరా? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  

ఓడిపోతే ఈవీఎంలను నిందిస్తరా? : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ఓడిపోతే ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ఈవీఎంలు, ఎన్నికల కమిషన్ ను నిందించడం ఏంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు ప్రశ్నించారు. ఈనెల 10న సికింద్రాబాద్‌‌‌‌  పరేడ్  గ్రౌండ్స్​లో నిర్వహించనున్న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని కోరారు.

మంగళవారం తార్నాకలో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌‌‌‌కు హాజరై మాట్లాడారు. మోదీ నాయకత్వంలో భారత్  ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. బెంగాల్‌‌‌‌లో 100 సీట్లలో ఓట్ల చోరీ జరిగిందని మమత అంటున్నారని, గెలిచినప్పుడు లేని అభ్యంతరాలు, ఓడిపోతే వస్తున్నాయా? అని ప్రశ్నించారు.