ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : ఎన్‌‌వీఎస్‌‌ఎస్‌‌ ప్రభాకర్‌‌‌‌

ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : ఎన్‌‌వీఎస్‌‌ఎస్‌‌ ప్రభాకర్‌‌‌‌

ఉప్పల్,  వెలుగు:  ఒక్క అవకాశమివ్వండి..  ఉప్పల్‌‌ను నగరంలోనే అభివృద్ధిలో రోల్​మోడల్‌‌గా తయారు చేసి చూపిస్తానని ఉప్పల్​సెగ్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వీఎస్​ఎస్​ ప్రభాకర్​ అన్నారు.  గతంలో ఎమ్మెల్యేగా  గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపించాను.  కానీ అసెంబ్లీని అర్థాంతరంగా  రద్దు చేయడంతో పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాన్నారు.  

శ్రీధర్‌‌‌‌ గుప్తా ఆధ్వర్యంలో ఉప్పల్ డివిజన్‌‌లోని కావేరి నగర్‌‌‌‌, సెవెన్‌‌ హిల్స్‌‌ కాలనీ, పద్మావతి కాలనీల్లో సోమవారం పాదయాత్ర నిర్వహించారు.  ఉప్పల్ కావేరి నగర్‌‌‌‌ కల్వర్టు అస్తవ్యస్తంగా ఉన్న  టైంలో నిధులు తీసుకొచ్చి కల్వర్టును కట్టించిన ఘనత నాకే దక్కుతుందన్నారు.  కాప్రా డివిజన్ భవానినగర్‌‌‌‌లోని వరుణ్ ఎంక్లేవ్  నివాసులు, ఏఎస్ రావు నగర్ డివిజన్ లోని మై ఫీల్డ్ హోమ్స్ లో అపార్ట్మెంట్ వాసులతో  ముఖాముఖిలో పాల్గొన్నారు.  

వారు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు.   ఏఎస్.రావు నగర్ డివిజన్ ఈసీఐఎల్ బస్టాండ్  సమీపంలోని ఆటో స్టాండ్,  బీఎంఎస్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ వారితో ప్రభాకర్ ముచ్చటించారు.  ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.