IND v ENG: ఉప్పల్‌లో మ్యాచ్..టికెట్ల రేట్ ఎంత..ఎక్కడ దొరుకుతాయి..

IND v ENG: ఉప్పల్‌లో మ్యాచ్..టికెట్ల రేట్ ఎంత..ఎక్కడ దొరుకుతాయి..

స్వదేశంలో ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా మొదటి టెస్ట్ హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లో జరగనుంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల విక్రయం జనవరి 18 (గురువారం) నుంచి ప్రారంభమవుతుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రకటించారు. టిక్కెట్ల విక్రయాలపై హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులతో సమీక్షించిన వివరాలను ఆయన ఆదివారం వెల్లడించారు. జనవరి 18 నుంచి Paytm ఇన్‌సైడర్ యాప్‌లో టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించనున్నట్లు ప్రకటించింది. మిగిలిన టిక్కెట్లు జనవరి 22 నుండి జింఖానాలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటాయి.

ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి జనవరి 22 నుండి జింఖానా హెచ్‌సిఎ స్టేడియంలో టిక్కెట్లను రీడీమ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. జాతి కోసం తమ రక్తాన్ని చిందిస్తూ తెలంగాణలో పనిచేస్తున్న భారత సాయుధ బలగాలకు గణతంత్ర దినోత్సవం రోజున మ్యాచ్‌ను ఉచితంగా చూసేందుకు అనుమతిస్తామని జగన్మోహన్‌రావు తెలిపారు. ఆసక్తి గల సైనికులు తమ డిపార్ట్‌మెంట్ హెడ్ సంతకం చేసిన లేఖను, యు కుటుంబ సభ్యుల వివరాలను జనవరి 18లోపు HCA CEOకి ఇమెయిల్ చేయాలని సూచించారు.

ఈ టెస్టు మ్యాచ్ కు నగరంలోని ప్రభుత్వ పాఠ‌శాల‌లతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్ విద్యార్థుల‌ను ఉచితంగా అనుమతించ‌నున్నారు. మ్యాచ్‌కు విచ్చేసే విద్యార్థుల‌కు హెచ్‌సీఏ ఉచితంగా భోజ‌నం కూడా అందించ‌నుంది. ఈనెల 18వ తేదీ లోపు హెచ్‌సీఏ సీఈఓకు పాఠ‌శాల‌ల ప్రిన్సిపాల్స్ త‌మ స్కూల్ నుంచి ఎంత మంది విద్యార్థులు, స్టాప్ వ‌స్తున్నారో తెలిపాలని పేర్కొంది.

టిక్కెట్ ధరల వివరాలు; రూ. 200 రూ. 499 రూ. 1000 రూ.1250
-హాస్పిటాలిటీ రూ.3,000తో కార్పొరేట్ బాక్స్ ఉత్తరం
-కార్పొరేట్ బాక్స్ సౌత్ హాస్పిటాలిటీతో రూ.4,000