యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC).. 2026 జాబ్ క్యాలెండర్ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC).. 2026 జాబ్ క్యాలెండర్ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC)..కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి పోస్టులకు రాతపరీక్షలను నిర్వహిస్తుంది. సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ మొదలు సీడీఎస్‌ఈ వరకూ పలు ఉన్నత స్థాయి పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది.ఇందుకోసం ప్రతి ఏటా ముందుగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తుంది. దాదాపు ఏడాది ముందుగానే ఆయా ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటిస్తుంది. తాజాగా యూపీఎస్సీ 2026కు సంబంధించి ఎగ్జామ్‌ క్యాలెండర్‌ను విడుదల చేసింది. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 2026 వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష మే 24న నిర్వహించబడుతుంది.మెయిన్స్ పరీక్ష ఆగస్టు 21, 2026న జరగనున్నాయి. సివిల్ సర్వీసెస్ (CSE) పరీక్షకు కమిషన్ అధికారిక నోటిఫికేషన్‌ను జనవరి 14న విడుదల చేస్తారు. ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

ఏప్రిల్‌లో NDA, NA, CDS 1 ఎగ్జామ్స్ 

కమిషన్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ/నావల్ అకాడమీ,కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (UPSC NDA/NA, CDS 1) పరీక్షను ఏప్రిల్ 12న షెడ్యూల్ చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ,దరఖాస్తు ఫారం అదే రోజున డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. డిసెంబర్ 30 దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షల రెండో దశ సెప్టెంబర్ 13, 2026న నిర్వహించనున్నారు. 

UPSC CAPF పరీక్ష తేదీ

కమిషన్ జూలై 19, 2026న సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) పరీక్షను నిర్వహించనుంది. ముఖ్యంగా UPSC ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 3, 2026. అభ్యర్థులు క్రింద పేర్కొన్న పట్టికలో మొత్తం UPSC 2026 వార్షిక పరీక్ష షెడ్యూల్‌ను చెక్ చేసుకోవచ్చు.