ఏడాది పాటు జీతంలో 30 శాతం త‌గ్గించుకుంటం

ఏడాది పాటు జీతంలో 30 శాతం త‌గ్గించుకుంటం

లాక్ డౌన్ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లువురు దాత‌లు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఏకంగా ఏడాది పాటు త‌మ జీతంలో 30 శాతం త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) చైర్మైన్, సిబ్బంది. కరోనాపై దేశం చేస్తున్న పోరాటానికి తాము మద్దతుగా నిలుస్తామ‌న్నారు. లాక్ ​డౌన్ ​కారణంగా కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఏడాదిపాటు తమ జీతాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు.

బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​ ఒక సంవత్సరం పాటు తమ బేసిక్​ పే నుంచి 30 శాతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో పాటు వారి ఒక రోజు వేతనాన్ని పీఎం రిలీఫ్ ​ఫండ్, పీఎం కేర్స్​ ఫండ్​కు ఇస్తున్నట్టు చెప్పారు.