ఐఈఎస్‌.. ఇంజినీర్స్‌ డ్రీమ్​

ఐఈఎస్‌.. ఇంజినీర్స్‌ డ్రీమ్​

ఐఈఎస్ పరీక్షను సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో నిర్వహిస్తారు. ఇండియన్ రైల్వే సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్, ఇండియన్ నావల్ ఆర్నమెంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, ఇండియన్​ స్కిల్​ డెవలప్​మెంట్​ సర్వీస్​ తదితర విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, సర్వేయర్​ వంటి పోస్టుల్లో సెలెక్టెడ్​ క్యాండిడేట్స్​ ఉద్యోగాలు పొందుతారు.

సెలెక్షన్ ప్రాసెస్

సెలెక్షన్‍ ప్రొసీజర్‍ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమ్స్​లో ఒక్కో బ్రాంచ్‍లో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్‍ విధానంలో ఉంటాయి. పేపర్​–1 అందరికీ కామన్​ కాగా మిగిలినవి ఆయా బ్రాంచ్​ల సబ్జెక్టులు. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతున నెగెటివ్​ మార్క్స్​ ఉంటాయి. 

ప్రిపరేషన్ ప్లాన్​: 

ప్రిలిమ్స్​: ప్రీవియస్ ఎగ్జామ్​ కట్ఆఫ్ మార్కులు పరిగణనలోకి తీసుకొని ప్రిపరేషన్​ ప్రారంభించాలి. సిలబస్​ పూర్తిగా అర్థం చేసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ పట్టు ఉందో దాన్ని ముందు పూర్తి చేయాలి. టెక్నికల్ సబ్జెక్ట్​లోని ఫండమెంటల్స్​పై ఎక్కువ ఫోకస్​ చేయాలి. వీటితో పాటు జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు న్యూస్​ పేపర్స్​ చదువుతూ అప్​డేట్​ అవ్వాలి. సబ్జెక్ట్​ చదివిన తర్వాత ప్రీవియస్​ పేపర్స్​ ప్రాక్టీస్​ చేయాలి. ప్రిపరేషన్ సమయంలో ప్రతి సబ్జెక్టులోని ముఖ్యమైన అంశాలను, ఫార్ములాలకు సంబంధించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రివిజన్​ ఈజీగా ఉంటుంది.  ఎగ్జామ్​లో టైమ్​ మేనేజ్​మెంట్​ కీలకం. ప్రాక్టీస్​ చేసే సమయంలో టైమ్ లిమిట్ పెట్టుకొని సాధన చేయాలి. కొత్తగా సిలబస్​లో యాడ్​ చేసిన ఇంజినీరింగ్​ డ్రాయింగ్​, ఎథిక్స్​పై ఫోకస్​ చేయాలి. మారిన సిలబస్​కు అనుగుణంగా స్టాండర్డ్ పుస్తకాలు ఎంచుకోవాలి. ప్రతి సబ్జెక్టుని ఆబ్జెక్టివ్​ మరియు సబ్జెక్టివ్ తరహాలో ప్రిపేర్ అవ్వాలి. 

మెయిన్స్​:  మెయిన్స్​లో స్టేజ్​–1 లోని ఇంజినీరింగ్ సిలబస్ ను రెండు పేపర్లు గా విభజించారు . ఈ పరీక్షలో విద్యార్థి బేసిక్స్​తో పాటు అడ్వాన్స్ విషయాలపై అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమ్స్​ తర్వాత  మెయిన్స్​కు 4 నుంచి 5 నెలల సమయం ఉంటుంది. ఈ టైమ్​లో ఎక్కువగా రివిజన్​కు కేటాయించాలి. సబ్జెక్టివ్​ తరహాలో మెయిన్స్​ ఉంటుంది. కావున రైటింగ్​ ప్రాక్టీస్​ చేయాలి. రాసే ప్రతి సమాధానానికి పూర్తి వివరణ ఇవ్వాలి . అవసరం లేని అదనపు సమాధానం రాసి సమయాన్ని వృథా చేసుకోవద్దు.

ఇంటర్వ్యూ: అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థి ఆలోచనా విధానం, శక్తి సామార్థ్యాలు, నిజాయితీని అంచనా వేస్తారు. ఉద్యోగం చేస్తున్న లేదా ఎంటెక్ చేస్తున్న సంబంధిత విషయాల గురించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సామాజిక, వర్తమాన అంశాలపై  అడగొచ్చు. గత రెండు సంవత్సరాల నుంచి ఇంటర్వ్యులో వ్యక్తిగత విషయాలు, హాబీలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రశ్నలు అడుగుతున్నారు. సబ్జెక్ట్​ ఫండమెంటల్స్​, కరెంట్​ ఎఫైర్స్​ బ్యాలెన్స్​ చేస్తూ మాక్​ ఇంటర్వ్యూలకు అటెండ్​ అయితే ముఖాముఖిలో సక్సెస్​ అవ్వొచ్చు. 

సిలబస్​

పేపర్​–1 జనరల్​ స్టడీస్​ అండ్​ ఇంజినీరింగ్​ ఆప్టిట్యూడ్​లో సామాజిక, ఆర్థిక, పారిశ్రామికంగా అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన వర్తమాన అంశాలు, లాజికల్ రీజనింగ్​ అండ్​ అనలిటికల్​ ఎబిలిటీ, ఇంజినీరింగ్​ మ్యాథమెటిక్స్‌ అండ్​ న్యూమరికల్​ అనాలసిస్, జనరల్​ ప్రిన్సిపుల్స్​ ఆఫ్​ డిజైన్​, డ్రాయింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్​ సేఫ్టీ, స్టాండార్డ్స్​ అండ్​ క్వాలిటీ ప్రాక్టీసెస్​ ఇన్​ ప్రొడక్షన్​, కన్​స్ర్టక్షన్, మెయింటెనెన్స్ సర్వీస్​, బేసిక్స్​ ఆఫ్​ ఎనర్జీ అండ్​ ఎన్విరాన్​మెంట్​, బేసిక్స్​ ఆఫ్​ ప్రాజెక్ట్​ మేనేజ్​మెంట్, మెటీరియల్​ సైన్స్​ అండ్​ ఇంజినీరింగ్​, ఇన్ఫర్మేషన్​ అండ్​ కమ్యూనికేషన్ బేస్డ్​ టెక్నాలజీస్​, ఎథిక్స్​ అండ్​ వ్యాల్యూస్​ ఇన్​ ఇంజినీరింగ్​ ప్రొడక్షన్ అనే టాపిక్స్​ ఉంటాయి. ప్రిలిమ్స్​లోని పేపర్​–2, మెయిన్​లోని రెండు పేపర్లలో సంబంధిత ఇంజినీరింగ్​ సబ్జెక్టు నుండి ప్రశ్నలొస్తాయి.