యురేనియం తవ్వకానికి అనుమతివ్వలేదు : కేటీఆర్

యురేనియం తవ్వకానికి అనుమతివ్వలేదు : కేటీఆర్

నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు మంత్రి కేటీఆర్. ఆదివారం శాసనమండలి క్వశ్చర్ అవర్ లో నర్సిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. నల్లమల్లలో యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ తవ్వకాలకు అనుమతించబోమన్నారు. అటవీ ప్రాంతంలో రోడ్లు వేయడానికి కూడా పర్మిషన్ లేదన్నారు. యురేనియం ఉందా లేదా అనేది పరీక్షలు మాత్రమే amd వాళ్ళు చేస్తున్నారని తెలిపిన కేటీఆర్.. చంద్రాయన్ లో వాడేది కూడా యురేనియమే అన్నారు.

రాజకీయ నాయకులు బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారన్న ఆయన..ఒక పార్టీ అధ్యక్షుడు ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలవకుండా వారు మాట్లాడుతున్నారని..వార్త పేపర్ లు కూడా తప్పులు ప్రచురిస్తున్నాయని తెలిపారు. నర్సీరెడ్డి గారు పేపర్ చూసి మాట్లాడినట్టు ఉన్నారని.. పేపర్ లో రాసినట్టు ఏమి ఉండదన్నారు. యురేనియం తవ్వకాలపై సీఎంతో చర్చించి అధికారికంగా తీర్మానం పెట్టేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్.