మహబూబాబాద్ కు యూరియా తరలిస్తున్నారని రైతుల ఆందోళన.. ఆటోలోని యూరియా స్వాధీనం

మహబూబాబాద్ కు యూరియా తరలిస్తున్నారని రైతుల ఆందోళన.. ఆటోలోని యూరియా స్వాధీనం

పాల్వంచ, వెలుగు : భద్రాద్రికొత్త గూడెం జిల్లా పాల్వంచలోని కో ఆపరే టివ్ సొసైటీ కార్యాలయం నుంచి  మహబూబాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 17 యూరియా బస్తాల ఆటోను బుధవారం స్థానిక రైతులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. 

స్థానిక మండల రైతుల పేరిట యూరియాను తీసుకున్న సదరు ఆటో యజమాని తాను త్వరగా వెళ్లిపోవాలని యూరియా బస్తా లు వేయాలని హడావుడి చేయడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఈ బస్తాలు ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆటో డ్రైవర్ ను నిలదీశారు. 

ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో రైతులు తమకు ఇవ్వకుండా యూరియాను మహబూబాబాద్ వారికి ఎలా ఇస్తారంటూ ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పాల్వంచ సీఐ సతీశ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు. యూరియా బస్తా లను సొసైటీ కార్యాలయం గోడౌ న్ లో ఉంచారు. దీనిపై విచారణ చేస్తున్నా మని అగ్రిక ల్చరల్ ఆఫీసర్ శంభో శంకర్, టౌన్ ఎస్సై సుమన్ తెలిపారు.